నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది..
- January 21, 2016
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణకు ఈసీ ఇచ్చిన గడువు ముగిసినట్లయింది. నామినేషన్లలో అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో చివరిరోజు 454 మంది తిరుగుబాటు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు రాత్రి ప్రకటించనున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న భాజపా-తెదేపాలకు రెబల్స్ బెడద తప్పలేదు. పొత్తులో భాగంగా తెదేపా పార్టీకి కేటాయించిన డివిజన్లలో మూడింటిలో భాజపా తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. తెదేపా కూడా భాజపాకు కేటాయించిన స్థానాల్లో ఐదింటిలో తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







