కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో రెండు వరాలు!
- January 21, 2016
తెలంగాణలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్ (నిమ్జ్)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ జోన్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు ఆమె గురువారం తెలిపారు. దీంతో ప్రత్యక్షంగా 75వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ట్విట్ చేశారు. ఈ జోన్ లు ముఖ్యంగా ఔషద పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించేలా ఉంటాయని పేర్కొన్నారు. 2011లో రూపొందించిన పారిశ్రామిక విధానం ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ తరహా జోన్ లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా మెదక్ జిల్లా జరాసంగం మండలం న్యాల్‌కల్ లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్ కు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







