సంపెంగ పూ రేఖల వాకిలి
- January 21, 2016
జ్ఞాపకాల బోషాణ౦లో దాగడిపోయిన
ఆలోచనొకటి
మళ్ళీ దొరికినట్టు
చీకట్లో నేను వెతుకుతుంటే
పడుకునే వున్న ఆమె
‘అటు కాదు ఇటు’అంటుంది
మళ్ళీ
చీకటి పడుతున్న సమయం
వర్షపు చినుకులు మొదలవుతున్నాయి
రాత్రంత్రా నిక్కచ్చిగా కరెంటు కోత వుంటుంది
‘త్వరగా వచ్చేయండి’
రాత్రి పొడుగునా వర్షం
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇల్లు చేరాను
మలుపు చివర్న వరకు సోకే సంపెంగ పూల పరమళం
వెలుగు, చీకట్లలోను కన్పించే ధూప కాంతిలా
గేటెదుటే నీటిమడుగులో
మబ్బుచాటున చంద్రుడు
అప్పుడే జలకమాడి వెళ్ళినట్టు
అడుగులకు దీపకాంతిలా
నీటిలో వొక వెలుగు దివిటీని
వదిలి వెళతాడు
ఇవి....
మా ఇంటి ఆనవాళ్ళు
మొక్కల గూటిలో
గూటి నుండి
గూటికి చేరే
దారి తప్పడం
బహుకష్టం
ఈ మునివాకిలిలో
ఆనవాళ్ళు గుర్తులుగా ఎదుగుతాయి
చిరస్మరణీయ జ్ఞాపకాలుగా...
--సత్య శ్రీనివాస్ గుడ్లవల్లేటి
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







