6 నిమిషాల్లో స్పందించిన అజ్మాన్ పోలీస్
- February 22, 2020
అజ్మాన్ పోలీస్, అత్యవసర సమయాల్లో స్పందించే సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. కేవలం ఆరు నిమిషాలకు దీన్ని తీసుకురాగలిగారు. డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ డిపార్టమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ హిషామ్ అబ్దుల్లా అబు షిహాబ్ మాట్లాడుతూ, అజ్మాన్ పోలీస్ ఈ అరుదైన ఘనత సాధించడం వెనుక చాలా కష్టం దాగి వుందని అన్నారు. ఎమిరేట్ లోని పలు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోల్స్ కి సంబంధించి 10 కీలకమైన ఫోకస్ పాయింట్లను రూపొందించుకుని, వాటికి అనుగుణంగా ప్రణాళిక చేపట్టామనీ, మొత్తం 60 సేఫ్టీ మరియు సెక్యూరిటీ పెట్రోల్స్, 40 ట్రాఫిక్ పెట్రోల్స్ ఇంటిగ్రేషన్ తో ఈ ఘనతను సాధించగలిగామని చెప్పారాయన. రేడియో వేవ్ డివైజ్లు, సమగ్రమైన అవగాహన, సమాచారం సకాలంలో ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి ద్వారా క్విక్ రెస్పాన్స్ సాధ్యమవుతోందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







