షూటవుట్: ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు
- February 22, 2020
మదీనా: సౌదీ గన్ మెన్ తో జరిగిన కాల్పుల నేపథ్యంలో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలయ్యయి. ఈ మేరకు మదీనా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి ఓ ప్రకటన విడుదల చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరుపుతూ నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతన్ని నిలువరించే ప్రయత్నంలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. అంతకు ముందు నిందితుడి కాల్పులపై సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందడంతో, అతన్ని నిలువరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘటనలో గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందికి వైద్య చికిత్స అందుతోంది. నిందితుడి వివరాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలేమిటి.? అన్నదానిపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







