స్పైసీ ఫుడ్ వల్ల బరువు కూడా తగ్గుతారని మీకు తెలుసా ?
- January 22, 2016
చలికాలంలో.. వెచ్చగా ఉండటానికి పెద్ద దుప్పట్లు, స్వెట్టర్లు ఉపయోగిస్తాం. అలాగే తీసుకునే ఆహారంలో కూడా కాస్త ఘాటుగా ఉండాలని కోరుకుంటాం. ఏదైనా స్పైసీగా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రుచిగా, ఘాటుగా ఉండే ఫుడ్ తీసుకోవాలని మసాలాలు ఎక్కువగా చేర్చుకోవడం లేదా.. బయట స్పైసీ ఫుడ్ తినడం చేస్తుంటారు.మిగిలిపోయిన ఆహారాలను వేడిచేస్తున్నారా ? ఐతే జాగ్రత్తచలికాలంలో స్పైసీ ఫుడ్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే స్పైసీ ఫుడ్ లో వాడే మసాలాలు కొన్ని మేలు చేస్తాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. కానీ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల నర్వ్స్ పనితీరు సక్రమంగా ఉంటుంది. అలాగే ఆకలి కూడా తగ్గుతుంది.అంతేకాదు స్పైసీ ఫుడ్ వల్ల బరువు కూడా తగ్గుతారని మీకు తెలుసా ? ఎందుకంటే.. ఘాటుగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అవి శరీరంలో కొలెస్ర్టాల్ కరిగిస్తాయి. శరీరంలో వేడిగా.. వెచ్చగా అనిపిస్తుంది. దీనివల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గర్భాధారణ సమయంలో తినకూడని.. తినవల్సిన ఆహారాలు...!చలికాలంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టే తలనొప్పి, జలువు, తుమ్ములు, దగ్గు వంటి సమస్యలకు కూడా స్పైసీ ఫుడ్ చెక్ పెడుతుంది. కొన్ని రకాల దినుసులైన మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తే.. వాటి ఘాటు ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.కొంతమందికి స్పైసీ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరీ ఎక్కువ మోతాదులో ఘాటు పదార్థాలు తీసుకోవడం వల్ల దుర్వాసన, చెమట వేధిస్తాయి. కాబట్టి రోజులో ఏదో ఒకసారి.. అలవాటు లేనివాళ్లైతే.. అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది. మోతాదుకు మించి తీసుకోకూడదు. అలాగే.. బయట దొరికే స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండటమే మంచిది.అయితే స్పైసీ ఫుడ్ చలికాలంలో మంచిది కదా అని.. పలుమార్లు దానినే ఎంచుకుంటే ప్రమాదం. అది కూడా ఇంట్లో తయారు చేసుకున్నవైతే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. స్పైసీ ఫుడ్ తినాలనిపించినప్పుడల్లా.. బయట దొరికే ఫుడ్స్ తింటే.. అల్సర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఎక్కువ స్పైసీ తినే అలవాటు లేకపోతే.. నోటిపూత కూడా ఇబ్బందిపెట్టవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







