వాట్సాప్ అడ్మిన్లూ, జర భద్రం!!!
- January 22, 2016
వాట్సప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్లు జాగ్రత్త ఉండాలని ఈ వార్త చూస్తే అర్తమవుతుంది. వాట్సాప్ గ్రూపులో ఇద్దరు వ్యక్తులు బూతు చిత్రాల (పోర్న్) ఫొటోలు, జోక్స్ పెట్టి చిక్కుల్లో పడ్డారు. అభ్యంతకరమైన ఫొటోలు, సమాచారం పెడుతుండటంతో వారిద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో వాట్సాప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. మహిళల గురించి అసభ్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని వారి గురించి ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను మనోజ్, కుల్దీప్‌గా గుర్తించారు. వారికి స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే అనంతరం వారు పుచీకత్తు సమర్పించడంతో బెయిల్ మీద విడుదలయ్యారు. నిజానికి మనోజ్ వాట్సాప్ గ్రూపులో ఎలాంటి పోర్న్ వీడియోలు, ఫొటోలు పోస్టుచేయలేదని, కానీ అతను కుల్దీప్‌ను గ్రూపులో చేర్చడమే కాకుండా మహిళల ఫిర్యాదు చేసినా అతన్ని గ్రూపు నుంచి తొలగించేలేదని, అందుకే అడ్మినిస్ట్రేటర్ అయినా అతన్ని కూడా అరెస్టు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాబట్టి వాట్సాప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్లు తస్మాత్ జాగ్రత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







