మనస్సాక్షి
- May 21, 2015
ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం ఎక్కడో పడిపోయింది. కోట మొత్తం వెతికించినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బీర్బల్ ని దర్బారుకు పిలిపించి 'నా ఉంగరం కనిపించడంలేదు. సేవకులు కోటంతా వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మన సభలోని వాళ్ళే ఎవరో దొంగాలించారని నా అనుమానం. ఎవరు దొంగాలించారో కనిపెట్టగలవా?' అని అడిగాడు. బీర్బల్ ఒక్క నిమిషంపాటు ఆలోచించి 'ఇది చాలా సులువైన పని మహారాజా, ఉంగరం దొంగిలించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే అతడి గడ్డంలో ఒక బియ్యపుగింజ ఉంటుంది. దాన్నిబట్టి ఎవరు దొంగతనం చేశారో తేలిపోతుంది. అందరి గడ్డాలూ ఒక్కసారి పరిశీలించి అసలైన దొంగను కనిపెట్టేస్తాను' అన్నాడు. ఆ మాటలు వింటూనే సభలోని ఒక వ్యక్తి భయంభయంగా తన గడ్డం తడుముకున్నాడు. అది చూసిన బీర్బల్ వెంటనే అతడిని పట్టించాడు. 'దొంగ గడ్డంలో బియ్యపుగింజ ఉందన్న విషయం నీకెలా తెలుసు?' అంటూ అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. 'గడ్డంలో బియ్యపుగింజ ఎలా ఉంటుంది మహారాజా, తప్పు చేసిన వ్యక్తిని మనస్సాక్షి ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పు చేయనివాళ్ళు దొంగతనం చేసింది ఎవరా అని అటూఇటూ ఆసక్తిగా చూస్తుంటే తప్పుచేసిన వ్యక్తి భయంతో గడ్డం తడుముకున్నాడు' అంటూ అసలు సంగతి వివరించాడు. అలా తన తెలివితేటలను, సమయస్ఫూర్తితో దొంగను పట్టించడమే కాకుండా రాజు గారి ప్రశంసలూ అందుకున్నాడు బీర్బల్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







