హెల్మెట్లు వినియోగించని వారి లైసెన్సులు రద్దు!
- January 25, 2016
ఏపీలకు హైకోర్టు సూచన హైదరాబాద్, జనవరి 25 హెల్మెట్లు ధరించని వారిపై కేసులు నమోదు చేయడం కాదు... వాటిని వినియోగించేలా చర్యలు ఉండాలని హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. హెల్మెట్ల వినియోగం తెలుగు రాషా్ట్రల్లో ఎందుకు అమలు కావడం లేదని నిలదీసింది. హైకోర్టు ప్రశ్నకు ఏపీ ఏజీ పీ వేణుగోపాల్ స్పందిస్తూ... హెల్మెట్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇలాంటి చర్యలవల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు... హెల్మెట్లు వినియోగించని వారి లైసెన్సులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ స్పెషల్ జీపీ స్పందిస్తూ... హెల్మెట్లు వినియోగించని వారిపై నిరుడు సెప్టెంబరులో 18వేలు కేసులు, అక్టోబరులో 19 వేలు, నవంబరులో 22వేలు నమోదు చేశామన్నారు. 45 వేల పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలంగాణ ఏజీ కోర్టుకు తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీ సరైన చర్యలు తీసుకుంటున్నట్లు కన్పించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటీవల తాను ఆదిలాబాద్ వెళ్లినప్పుడు అక్కడ కూడా హెల్మెట్ల వినియోగం సరిగా లేదని ఏసీజే వ్యాఖ్యానించారు. హెల్మెట్లు వాడకపోవడం వల్ల 2012 నుంచి నేటి వరకు 70 మంది చనిపోయారని తెలంగాణ స్పెషల్ జీపీ వివరించగా.... మరో 70 మంది మరణిస్తేగానీ చర్యలు తీసుకోరా... హైకోర్టు వ్యాఖ్యానించింది. వాహనాల చట్టం సెక్షన్ 129ని అమలు చేయాలని కోరుతూ న్యాయవాది ఉడతనేని రామారావు 2009లో దాఖలు చేసిన 'పిల్'పై బెంచ్ మరోసారి విచారించింది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







