2016లో యూఏఈ ఎంప్లాయీస్‌కి 10 శాతం వేతనాల్లో వృద్ధి

- January 26, 2016 , by Maagulf
2016లో యూఏఈ ఎంప్లాయీస్‌కి 10 శాతం వేతనాల్లో వృద్ధి




యూఏఈ మరియు జిసిసిలో ఉద్యోగులు ఈ ఏడాది 10 శాతం వేతనాల్లో వృద్ధి పొందవచ్చునని అంచనాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం వేతనాల్లో పెంపు అధికారికంగా లేకపోయినప్పటికీ 49 శాతం మంది 10 శాతానికి పైగా వేతన పెంపును అందుకున్నట్లు తెలియవస్తుంది. ఆయా విభాగాల్లో వారు సాధించిన ప్రగతికి ఈ వేతన పెంపు వర్తించినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సంవత్సరం కూడా 10 శాతం 'హైక్‌' ఉంటుంది. అయితే అన్ని విభాగాలకూ కాకుండా, ఎంపిక చేసిన విభాగాల్లో మాత్రమే కొందరికి ఈ పెంపు ఉండవచ్చు. 200 మంది యజమానులు, 2400 మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొనగా, వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చమురు ధరల పతనం ప్రధానంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com