ఐఫా అవార్డ్స్ ప్రధానోత్సవం ...
- January 26, 2016
భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఐఫా అవార్డ్స్ ప్రధానోత్సవం హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ ఉత్తరాదికే పరిమితమైన అవార్డ్స్‌ను ఈసారి దక్షిణాది నటులకు కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో టాలివుడ్, కోలివుడ్, సాండల్‌వుడ్, మళయాళ స్టార్లు స్టేజ్‌పై నృత్యాలతో అదరగొట్టారు. దిగివచ్చిన తారాలోకం హైదరాబాద్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం మొదలైంది. ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా అవార్డుల కార్యక్రమానికి తారాలోకం దిగివచ్చింది. అవార్డ్‌లను ప్రారంభించి 15 ఏళ్లు అవుతున్నా... ఇన్నాళ్లూ బాలివుడ్ కే ఇవి పరిమితమయ్యాయి.ఇప్పుడు దక్షిణాది సినిమాలకు స్థానం దక్కింది. రెండ్రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం తొలిరోజున గచ్చిబౌలి స్టేడియం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ సెలబ్రిటీలతో కళకళలాడింది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. తారల రాకతో భాగ్యనగరం కలర్‌ఫుల్ తారల రాకతో భాగ్యనగరం కలర్ఫుల్గా మారింది. ఐఫా అవార్డుల కార్యక్రమంతో గచ్చిబౌలిలో సందడి నెలకొంది. రామ్‌చరణ్, అదాశర్మ, శ్రియ, తాప్సి, తమన్నా, అఖిల్ తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించనున్నారు. ఇందుకోసం వారు కొద్దిరోజులుగా స్టేడియంలో ముమ్మరంగా డాన్స్ ప్రాక్టీస్ చేశారు. నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం ఈ వేడుకల ద్వార వసూలు చేసిన నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాలు మొదటి రోజు ఘనంగా జరిగాయి. నేడు కూడా ఐఫా అవార్డుల వేడుక కలర్‌ఫుల్ గా కొనసాగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







