'దుబాయి-సంప్రదాయం' ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 'శ్రీ వేంకటేశ్వర కళ్యాణం'
- January 26, 2016
సంప్రదాయం-దుబాయి వారి సమర్పణలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం అంగ రంగ వైభవముగా జరిగింది.జనవరి 22, దుబాయి-సఫా లో కల జె.ఎస్.ఎస్ ప్రైవేటు స్కూలు నందు ఉదయము 7 గంటల నుంచి సాయంత్రము 7 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమములో 10,౦౦౦ మందికి పైగా భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించారు. తిరుపతి నుంచి వచ్చిన వేదపండితులు ఉదయము సుప్రభాత సేవ, అభిషేకము, కళ్యాణము, డోలోత్సవము మరియు సహస్ర దీపాలంకరణ సేవలను శాస్త్రోక్తముగా నిర్వహించారు. అన్న ప్రసాదములతో సహా తిరుమలని తలపించిన ఈ కార్యక్రమము లో అనేకమంది భక్తులు ఆనంద పారవశ్యము చెందారు. తిరుమల దుబాయి కి తరలి వచ్చిందని పలువురు భక్తులు విశేషముగా చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన 'సంప్రదాయం' టీం సభ్యులకు మాగల్ఫ్.కామ్ టీం తరుపున ప్రత్యేక అభినంధనులు.





తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







