యూఏఈ:కోవిడ్ నియంత్రణ నిబంధనలు పాటించని ప్రవాసీయులపై దేశ బహిష్కరణ
- April 10, 2020
యూఏఈ:కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఖచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని, స్టే హోం నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తమ హెచ్చరికలను ఆషామాషిగా తీసుకుంటున్నారని అలాంటి వారు భారీ మూల్యం చెల్లించకతప్పదని వార్నింగ్ ఇచ్చారు. సమాజిక దూరం పాటించకపోయినా, అవసరం లేకున్నా రోడ్ల మీద తిరిగినా ప్రవాసీయుల గుర్తింపు కార్డు నెంబర్ ఆధారంగా జరిమాన విధిస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. అయితే..పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగనిస్తామని, అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించటంతో పాటు జైలుకు పింపిస్తామని, శిక్షా కాలం పూర్తైన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడి చేపడుతున్న చర్యలకు విఘాతం కలిగించటం చిన్న నేరంగా భావించటం లేదని మరోసారి ప్రజలను హెచ్చరించారు. నేమింగ్ అండ్ షేమింగ్ పద్దని కూడా అనుసరిస్తామని సామాజిక దూరం పాటించకున్నా, రోడ్ల మీద తిరిగినా వారి ఫోటోలను అన్ని పేపర్లలో ముందు పేజీలో అచ్చు వేయించి సమాజానికి వారు ఎంత హానికరమో ప్రజలకు వివరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇక సోషల్ మీడియా రెండు వైపుల పదును ఉన్న కత్తి అని దాన్ని మంచి పనులకు, కొత్త విషయాలను నేర్చుకునేందుకు మాత్రమే వినియోగించాలని, ఎవరైనా సోషల్ మీడియాలో అపోహాలను ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







