కోవిడ్ 19:మెడికల్ ఫ్యాక్టరీస్ లను పరిశీలించిన ఖతార్ ప్రధాని

- April 10, 2020 , by Maagulf
కోవిడ్ 19:మెడికల్ ఫ్యాక్టరీస్ లను పరిశీలించిన ఖతార్ ప్రధాని

దోహా:కరోనా వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు తమ దేశంలో వైద్య రంగం సన్నద్ధతపై ప్రధాని, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తని ఆరా తీశారు. చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక వాడలోని పలు మెడికల్ ఫ్యాక్టరీస్ లో మందుల తయారీని పరిశీలించి, ఉత్పత్తి తీరును గురించి అక్కడి అధికారులను అడిగి తెల్సుకున్నారు. దేశీయ మార్కెట్ డిమాండ్ కు తగినంతగా మాత్రల ఉత్పత్తి అవుతున్నాయా లేదా అని ఆరా తీశారు. లోకల్ మార్కెట్ తో పాటు మిత్రదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉత్పత్తి జరగాలని ఆయన ఆకాంక్షించారు. వైరస్ కట్టడిలో వైద్య రంగం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే మెడికల్ ఫ్యాక్టరీల యాజమాన్యం, కార్మికులు, ప్రైవేట్ రంగంలోని పలువురు సమర్ధవంతంగా పని చేస్తున్నారని అన్నారు. చిన్న, మధ్య పారిశ్రామిక వాడలోని ఖతార్ ఫార్మా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ, ఖతార్ అల్-హయత్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ, అల్-మహా మెడికల్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com