1.5 లక్షల కోట్ల పెట్టుబడితో పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీ..
- January 26, 2016
పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఈఐఎల్ చేతులు కలుపుతున్నాయి. ఇవి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద రిఫైనరీని నెలకొల్పనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.మహారాష్ట్రలో దాదాపు 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో ఆయన తెలిపారు. తొలి దశలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఉంటాయని, 40 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుందని మంత్రి వివరించారు.ఐవోసీఎల్ రిఫైనరీల్లో చాలా వరకూ ఉత్తరాదినే ఉన్నాయి. ఫలితంగా పశ్చిమ, దక్షిణ ప్రాం తాల కస్టమర్లకు సేవలు అందించడం కష్టమవుతున్నందున అనువైన ప్రదేశం కోసం అన్వేషించిన ఐవోసీఎల్ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ రిఫైనరీలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఏటీఎఫ్ మొదలైనవి ఉత్పత్తి కానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







