భారత్ దేశ రాష్ట్రాల్లో ఉగ్రముప్పు..
- January 27, 2016
ఈరోజు ఉదయం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాద ముప్పు పొంచివున్న రాష్ట్రాల్లో భద్రత పెంచాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌తో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 17 రిజర్వు బెటాలియన్లు పంపాలని నిర్ణయించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటయ్యే కేంద్ర ప్రత్యేక బలగాల్లో నియామకాలపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ముందు లొంగిపోయిన, ప్రభుత్వానికి సహకరిస్తున్న వారిని నియమించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఆధీకృత మూలధనం వెయ్యికోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







