కోవిడ్ 19: ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- April 15, 2020
ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. ఎంతగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా...వైరస్ తీవ్రత మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి లక్షా 26వేల మందికిపైగా చనిపోయారు. ఇక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారి సంఖ్య వేలల్లోనే ఉంది. వైరస్ నిర్ధిష్టమైన చికిత్స లేకపోవటంతో వైరస్ వ్యాపించినంత వేగంగా కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం లేదు. 20 లక్షల మందికి వైరస్ సోకితే..అందులో ఇప్పటివరకు 4.84 లక్షల మందివరకు వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇదిలాఉంటే వైరస్ ధాటికి అమెరికా అల్లాడిపోతోంది. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రారంభంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంలో చేసిన ఆలస్యంతో ఆ దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రపంచంలోనే కరోనా ప్రభావం ప్రస్తుతం అమెరికాలో ఎక్కువగా ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 6.15 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. దాదాపు 26 వేల మందికిపైగా చనిపోయారు. చికిత్స పొందుతున్న వారిలో 13 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే..గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటం కొంతమేర ఉపశమనం కలిగించే అంశం. అమెరికా తర్వాత వైరస్ తీవ్రత స్పెయిన్ లో ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు స్పెయిన్ లో 1.77 లక్షల మంది వైరస్ బారిన పడితే..18 వేల మందికిపైగా చనిపోయారు. మరో 7 వేల మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







