కువైట్‌లో గురువారం నుంచి భారతీయులకు ఆమ్నెస్టీ(క్షమాబిక్ష)
- April 15, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ను ఉపయోగించుకోవలసింది గా భారత రాయ బార కార్యాలయం కొద్ది సేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 16 వ తేది(గురువారం) నుండి 20 వ తేది(సోమవారం) వరకు ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు ఫర్వానియ గవర్నరేట్ లోని ముత్తన్న ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 122 లో మగ వారు నమోదు చేసుకోవాలి. మహిళలు ఫర్వానియ గవర్నరేట్ లోని ఫర్వానియ ప్రైమారి స్కూల్ ఫర్ గర్ల్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 76 లో నమోదు చేసుకోవాలి. అలాగే జేలీబ్ అల్ షువైక్ లో నయీం బిన్ మసౌద్ స్కూల్ బాయ్స్ బ్లాక్ 4 స్ట్రీట్ 250 లో మగ వారికి, రుఫిడా అల్-అస్లమియా ప్రైమరీ స్కూల్ బ్లాక్ 4 స్ట్రీట్ 200 లో మహిళలకు కేటాయించారు.
ట్రావెల్ పత్రాలు అంటే పాస్ పోర్ట్ ఉన్నవారందరూ కుడా పైన పేర్కొన్న సెంటర్లకు వెళ్ళాలి. వీరందరూ వారికి సంభందించిన లగేజ్ మొత్తం సర్దుకొని వెంట తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వారి నమోదు పక్రియ కాగానే వారిని షెల్తర్లకు తరలిస్తారు. అక్కడ నుండి నేరు గా వారిని భారత దేశానికి తరలిస్తారు. ఎప్పుడు వారి ప్రయాణం ఉంటుందో ఇరు దేశాల ద్వైపాక్షిక సంభందాల మిధ ఆధార పడి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







