మరో రీమేక్ చిత్రం లో వెంకీ ..
- January 27, 2016
టాలీవుడ్ లో వరుస రీమేక్ లతో సూపర్ హిట్ లు కొడుతున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కెరీర్ లో స్ట్రయిట్ సినిమాలుగా చేసిన వాటికన్నా రీమేక్ సినిమాలే ఎక్కువగా సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా తన బాడీలాంగ్వేజ్ కు, ఇమేజ్ కు తగ్గ కథలు ఏ భాషల్లో వచ్చినా వదిలిపెట్టని వెంకీ, ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు. ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన సినిమాలే, రీమేక్ చేసే ఈ సీనియర్ స్టార్, ఈ సారి మాత్రం ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమా మీద దృష్టి పెట్టాడు.సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సాలాఖద్దూస్. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ చూసిన వెంకీ, తెలుగులో రీమేక్ చేయడానికి ఓకె చెప్పాడట. అంతేకాదు దర్శక నిర్మాతలు ఓకె అంటే ఈ ఏడాదిలో ఆ సినిమాలో నటించడానికి రెడీ అన్నాడట.తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ ఓ రిటైర్ట్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. మంచి బాక్సర్ ను వెతికి పట్టుకొని, తనను ఛాంపియన్ గా తయారు చేయటమే సినిమా కథ. మంచి కథా కథనాలతో పాటు సినిమాటిక్ డ్రామా కూడా కావాల్సినంత ఉండటంతో ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







