తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అండగా నిలుస్తాo: కోమటి జయరాం
- January 27, 2016
ఉన్నత విద్యను భ్యసించేందుకు అమెరికాకు వచ్చిన, వస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అండగా నిలుస్తామని అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. బుధవారం ఆయ న టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌తో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులకు తానా సంఘం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. ఇందుకోసం ప్రతి విద్యార్థీ మంచి విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోవటంతోపాటు అధికారులు అడిగే ఇంటర్వ్యూలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై రావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. నార్త్ ఆమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా తనను నియమించి నుందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ అభివృద్ధికోసం అమెరికాలోని ప్రవాస భారతీయుల ద్వారా మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి సాధించేం దుకు పెట్టుబడులు తెస్తామన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







