కోవిడ్ 19: డాక్టర్ అవతారమెత్తిన కార్ మెకానిక్..అరెస్ట్ చేసిన పోలీసులు
- May 04, 2020
మనామా:బహ్రెయిన్ లో ఓ కార్ మెకానిక్ డాక్టర్ అవతారమెత్తాడు. వైద్యంలో ఎలాంటి డిగ్రీ లేకున్నా..ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నాడు. కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ప్రజల్లో నెలకొన్న భయాన్ని క్యాష్ చేసుకుంటూ తనకు వచ్చీరాని వైద్యం ప్రారంభించాడు. వ్యాపారం గిట్టుబాటు కావటంతో అతని కార్ షెడ్డునే క్లినిక్ గా మార్చేశాడు. అరద్ పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారీకి మాయమాటలు చెప్పి అసియాకు చెందిన దొంగ డాక్టర్ ఎదో ఒక మాత్రలు ఇస్తూ వైద్యం కొనసాగిస్తున్నాడు. అయితే..స్థానిక ప్రజలు నకిలీ డాక్టర్ బాగోతంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు, మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







