కో-ఆపరేటివ్ సొసైటీ భద్రతా సిబ్బందికి కరోనా వైరస్!..మార్కెట్ మూసివేత

- May 04, 2020 , by Maagulf
కో-ఆపరేటివ్ సొసైటీ భద్రతా సిబ్బందికి కరోనా వైరస్!..మార్కెట్ మూసివేత

కువైట్: ఖలీదియా కోఆపరేటివ్ సొసైటీ యొక్క సెంట్రల్ మార్కెట్లో భద్రతా సిబ్బందిలో ఒకరికి  కరోనా వైరస్ సోకినట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. దీంతో సెంట్రల్ మార్కెట్ ను క్రిమిరహితం చేయడానికి మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ రోజు నుండి ఒక రోజు మార్కెట్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన యాజమాన్యం.

"సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపాము. అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆరోగ్యం, వాణిజ్యం మరియు పౌర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖలతో కూడా భేటీ అయ్యాము" అని డైరెక్టర్ల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

డెలివరీ సేవను నిలిపివేశారు. ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి అవసరమైన జాగ్రత్తలు క్రిమిరహితం చేయడానికి సోమవారం 4/5/2020 నుండి సెంట్రల్ మార్కెట్‌ను ఒక రోజు మూసివేయాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 6/5/2020 బుధవారం నాడు కేంద్ర మార్కెట్లో పనులు తిరిగి ప్రారంభించబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com