'ది అదర్ ఇఫ్తార్'..ఇఫ్తార్ విశిష్టతను చాటుతూ తెరకెక్కిన చక్కని డాక్యుమెంటరీ
- May 11, 2020
పవిత్ర రమదాన్ మాసం మానవత్వానికి ప్రతిబింబం.ఉన్నంతలో ఇరుగు పొరుగుతో పంచుకునే దాతృత్వం...కఠోర దీక్ష, కఠిన క్రమశిక్షణ, నిత్యం అల్లాను ప్రార్ధించే ధార్మిక చింతన ఇలా నిజమైన మనిషితత్వాన్ని మనకు పరిచయం చేసే పవిత్ర మాసం.రమదాన్ కు ఉన్న విశిష్టతను గొప్పగా తెరకెక్కించిన లఘు చిత్రమే 'ది అదర్ ఇఫ్తార్'. పేరులోనే రమదాన్ పరమార్ధాన్ని ఇఫ్తార్ విశిష్టతను ప్రజలకు అర్ధమయ్యేలా చాటిచెప్పాడు దర్శకుడు ఇమ్రాన్.రమదాన్ ఉపవాసం తర్వాత ఇఫ్తార్ విందుతో ఒకరికొకరు ఆహారం పంచుకుని ఆత్మీయతను చాటుకునే విధానాన్ని...ధనిక, పేద బేధం లేకుండా అంతా ఒక్కటిగా చేరి అల్లా ప్రసాదించిన ఆహారాన్ని పంచుకునే తీరులో ఉండే ప్రేమను చక్కగా విశదీకరించారు దర్శకుడు. ఇమ్రాన్ స్వస్థలం బెంగళూరు. ప్రస్తుతం దుబాయ్ లో మష్రూమ్ మీడియా పేరుతో ఫిల్మ్ మేకర్ గా చిత్రాలను నిర్మిస్తున్నారు.నిజానికి గత డిసెంబర్ లోనే ది అదర్ ఇఫ్తార్ మేకింగ్ పూర్తైనా..రమదాన్ మాసం సందర్భంగా ఈ టీజర్ ని అందిస్తున్నారు.పూర్తిగా యూఈలోని స్థానిక లోకేషన్లలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించటం ఈ చిత్రం మరో ప్రత్యేకత.డిసెంబర్ లో పూర్తి డాక్యుమెంటరీ ని దుబాయ్ లో ఎమిరేట్స్ ప్రీమియర్ షో లో ప్రదర్శించనున్నారు.అలాగే లిఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2020, ఫస్ట్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్ 2020లో కూడా ది అదర్ ఇఫ్తార్ కు చోటు దక్కింది.



తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







