సౌదీ:ఈద్ సెలవుల సమయంలో 24 గంటల కర్ఫ్యూ అమలు

- May 13, 2020 , by Maagulf
సౌదీ:ఈద్ సెలవుల సమయంలో 24 గంటల కర్ఫ్యూ అమలు

సౌదీ:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈద్ అల్ ఫితర్ సెలవు రోజుల్లో కర్ఫ్యూ సమయాన్ని పొడిగించింది. దీంతో సెలవులు ఉండే ఆ 5 రోజుల పాటు సౌదీలో 24 గంటల కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర మక్కా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఆదేశాలను అమలు చేయనున్నారు. అయితే..అప్పటివరకు దేశంలోని అన్ని షాపులు, వ్యాపార కార్యాకలాపాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com