13.5 కోట్ల మంది ఉద్యోగాలపై వేటు..
- May 18, 2020
కోవిడ్ మహమ్మారి.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే కొన్ని చిన్న సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్డర్ డి.లిటిల్ అంచనా ప్రకారం భారత్లో సుమారు 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికాన్ని అనుభవిస్తారని వెల్లడించింది. రోజు రోజుకు భారత్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూస్తుంటే రికవరీ రేటు అంచనా వేయడం కష్టంగా ఉందని అంటూ ఆర్థిక రేటు డబ్ల్యూ ఆకారంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆర్థిక సవాళ్లను అధిగమించడం.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం పేరుతో రూపొందించిన ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నిరుద్యోగ రేటు ప్రస్తుతం ఉన్న 7.6 శాతం నుంచి 35 శాతానికి ఎగబాకొచ్చు. దీంతో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని మొత్తం మీద దేశంలో 17.4 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







