1091 ఔట్‌లెట్స్‌లో తనిఖీ, 8 వార్నింగ్స్‌ జారీ

1091 ఔట్‌లెట్స్‌లో తనిఖీ, 8 వార్నింగ్స్‌ జారీ

దుబాయ్‌ ఎకానమీ, రిటెయిల్‌ సెక్టార్‌ మరియు కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చాలావరకు కరోనా వైరస్‌ గైడ్‌ లైన్స్‌ పాటిస్తున్నాయనీ, లాక్‌డౌన్‌ తర్వాత రీ-ఓపెనింగ్‌ ఫేజ్‌లో బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. 1091 ఔట్‌లెట్స్‌ మరియు కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో తనిఖీలు నిర్వహించగా, ఏ ఒక్క షాప్‌నీ మూసివేయడంగానీ, దేనికీ జరీమానా విధించడంగానీ జరగలేదని దుబాయ్‌ ఎకానమీ వెల్లడించింది. 8 కంపెనీలకు మాత్రం వార్నింగ్స్‌ జారీ చేయడం జరిగింది. ఉదయం మార్కెట్‌ ఓపెనింగ్‌ సమయానికే తనిఖీలు మొదలవుతున్నాయనీ, ఆ తనిఖీలు షాప్‌లు మూసేవరకు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌, గ్లోవ్స్‌ మరియు మాస్క్‌లు ధరించడం సహా పలు నిబంధనల్ని షాప్‌లకు విధించడం జరిగింది. 

Back to Top