సొంత సభ్యుల్నే ఐసిస్ ఉగ్రవాద సంస్థ తల నరికిన వైనం !
- January 31, 2016తన కబంధ హస్తాల నుంచి తప్పించుకునిపోతున్న 20 మందికిపైగా సొంత సభ్యుల్నే ఐసిస్ ఉగ్రవాద సంస్థ తల నరికి చంపింది. ఈ ఘటన ఇరాక్‌లోని మోసుల్‌లో చోటు చేసుకుంది. మోసుల్‌లోని ఐసిస్ మిలిటెంట్లు కొందరు యుద్ధంనుంచి తప్పించుకుపోతుండగా ఓ చెక్‌పోస్టు వద్ద వారిని శుక్రవారం రాత్రి ఐసిస్ సిబ్బంది పట్టుకున్నారు.వారిని షరియా కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో 20 మందికిపైగా ఐసిస్ సభ్యుల్ని నరికి చంపేసినట్లు వార్తలొచ్చాయి. కాగా, బ్రిటన్‌లో ఇటీవలి పారిస్ దాడులకంటే తీవ్ర దాడులు చేస్తామని ఐసిస్ తన పత్రికలో హెచ్చరించింది.బకింగ్‌హామ్ ప్యాలెస్, నేషనల్ గ్యాలరీను లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







