ఎస్ జె సూర్యతో పవన్ కల్యాణ్
- January 31, 2016
ఎస్ జె సూర్యతో పవన్ కల్యాణ్ అజిత్ హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన 'వేదలం' సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందమూరి హీరోలు నటించే అవకాశముందని ఇప్పటివరకు ఊహాగానాలు విన్పించాయి. అయితే మరో టాప్ హీరో పేరు తెరపైకి వచ్చింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. 'ఖుషి'తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో 'వేదలం' రీమేక్ చేసేందుకు పవన్ అంగీకరించారని సినీవర్గాల సమాచారం. 'చాలా స్టోరీ లైన్లు అనుకున్నా వర్కవుట్ కాలేదు. వేదలం కథ పవన్ కు బాగా కుదురుతుందని భావించారు. సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ రెవేంజ్ స్టోరీని తెలుగులోనూ తెరకెక్కించాలని నిర్ణయించార'ని సినీ వర్గాలు వెల్లడించాయి.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ మొదలైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు ఎస్ జే సూర్య పలుమార్లు 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్ వచ్చారట. 'వేదలం' సినిమా నిర్మాత కూడా ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసారని సమాచారం. 'వేదలం' సినిమా రీమేక్ లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించే అవకాశముందని అంతకుముందు ఊహాగానాలు వచ్చాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







