వందే భారత్ మిషన్:ఒమన్ నుంచి భారతీయులను తరలిచేందుకు మరో 9 విమానాల ఏర్పాటు
- June 11, 2020
మస్కట్:ఒమన్ నుంచి స్వదేశానికి తిరిగి రావాలని ఆశిస్తున్న ప్రవాసభారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం మరో 9 విమానాలను ఏర్పాటు చేసింది. ఈ 9 విమానాలు ఈ నెల 17 నుంచి 30 వరకు మధ్యకాలంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో 7 విమానాలు కేరళకు, ఒకటి ఒడిషాలోని భువనేశ్వర్, మరోటి గోవాకు వెళ్లనున్నాయి.
ఒమన్ నుంచి ఇండియాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల వివరాలు :
జూన్ 17 - ఒమన్ నుంచి భువనేశ్వర్ (ఒడిషా) విమానం బయల్దేరుతుంది
జూన్ 18 - గోవాకు వెళ్లే విమానం ఒమన్ చేరుకుంటుంది
జూన్ 24 నుంచి 30 వరకు - తిరువనంతపురానికి 2 విమానాలు, 3 విమానాలు కొచ్చి, కన్నూర్, కోజికోడ్ కు ఒక్కో విమానం వెళ్తాయి.
వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ తొమ్మిది విమానాలను అదనంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. అయితే..ఈ విమానాల్లో ఎవరెవరికి సీట్లు కేటాయించాలనేది మాత్రం ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయిస్తుంది. ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రధాన్యత క్రమంలో టికెట్లను కేటాయిస్తారు. ముందుగా మెడికల్ ఎమర్జెన్సీ, గర్భిణిలకు, సీనియర్ సిటిజన్లకు అధిక ప్రధాన్యం ఇవ్వనున్నారు. అలాగే పర్యటనకు వెళ్లి లాక్ డౌన్ తో ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్వదేశానికి వెళ్లాలనుకునే వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన భారత్ రాయబార కార్యాలయం తుది జాబితాను సిద్ధం చేసి ప్రయాణికులకు ఫోన్, ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఎంబసీ నుంచి సమాచారం అందుకున్న వారు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలను సంప్రదించి టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







