టోల్‌టాక్సుల మోత తగ్గిపోయింది!

- February 01, 2016 , by Maagulf
టోల్‌టాక్సుల మోత తగ్గిపోయింది!

జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనదారులకు ఇంతవరకు భారంగా ఉన్న టోల్‌టాక్సుల మోత తగ్గిపోయింది.నిజామాబాద్ జిల్లా బిక్కనూరులో టోల్‌ప్లాజా ఏర్పాటు కావడంతో తూప్రాన్ వద్ద ఉన్న టోల్ గేటువద్ద రహదారి పన్నులు ఒక్కసారిగా సగానికి అంటే 45 శాతం తగ్గిపోయాయి. కొత్త టాక్సులు అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి. రాత్రి టోల్‌ప్లాజా నిర్వాహకులు పాత రేట్ల బోర్డులను మార్చి కొత్తరేట్ల బోర్డులను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు.కొత్త కాంట్రాక్ట్ కూడా ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. ఈసారి ఈగల్ అనే సంస్థ టోల్ టాక్సులను వసూలు చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు.ఇదివరకు 103 కిలో మీటర్లకు ఇక్కడ టాక్సులను వసూలు చేస్తుండేవారు.దీనితో అధికభారంపడి వాహనదారులనుంచి పలుసార్లు గొడవలు జరగడం,హైవే అథారిటీ సంస్థకు ఫిర్యాదులు చేయడం, మెదక్ పార్లమెంటు సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి కృషి ఫలితంగా బిక్కనూరు వద్ద మరో టోల్‌ప్లాజా ఏర్పాటైంది.దీనితో టోల్ భారం తగ్గి బిక్కనూరు నుంచి హైదరాబాద్ వైపుకు రాకపోకలు చేసే వాహనదారులకు ఊరటకలిగింది.ఇపుడు బోయిన్‌పల్లి నుంచి చేగుంట వరకు 61.538 కిలోమీటర్ల వరకు తాజాగా కొత్త టాక్సులను నిర్ణయిస్తూ హైవే సంస్థ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.దీని ప్రకారం సోమవారం నుంచి కార్లు,జీపులు, వ్యాను, ఇతర లైట్ మోటర్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ.70,రాకపోకలకు రూ. 105,నెలవారీ పాసుకు రూ.2315,టోల్‌ప్లాజా పరిధిలోని జిల్లా రిజిష్టర్ కలిగిన వాహనాలకైతే రోజుకు రూ.35 వసూలు చేస్తారు.లైట్ కమర్షియల్ వాహనాలు,గూడ్స్‌వాహనాలు,మినీ బస్సులకు సింగిల్ జర్నీకి 110, రాకపోకలకు170,నెలవారి పాసుకు3740, జిల్లా వాహనాలకు రోజుకు 55. బస్సు,ట్రక్కులకు రోజుకు 235,రాకపోకలకు 350, నెలవారీ పాసుకు 7830, జిల్లా వాహనాలకు రోజుకు 115 రూపాయలు. కమర్షియల్ వాహనాలకు రోజుకు255, రాకపోకలకు 385,నెలవారీ పాసుకు 8,545, జిల్లా వాహనాలకైతే 130 రూపాయలు. భారీ వాహనాలకు రోజుకు 370, రాకపోకలకు 555,నెలవారీ పాసుకు 12,280, జిల్లా వాహనాలకైతే 185 రూపాయలు.ఏడుకన్నా ఎక్కువ టైర్లు కలిగిఉన్న వాహనాలకు రోజుకు 450, రాకపోకలకు 675, నెలవారీ పాసుకు 14, 950 రూపాయలు, జిల్లా వాహనాలకైతే 225 రూపాయలు వసూలు చేస్తారు. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోగల లోకల్ వాహనాలకు యేడాది పాసుకు రూ.230 ఉంటుంది. టోల్ టాక్సుల భారం తగ్గడంతో ముఖ్యంగా తూప్రాన్ దగ్గరలోని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com