15 నుంచి మళ్లీ పూర్తిస్థాయిలో లాక్డౌన్ ..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- June 11, 2020
కరోనా విస్తరించకుండా మొదట్లో లాక్డౌన్ విధించిన కేంద్రం... ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో కరోనా కేసులు రోజురోజుకు భారీఎత్తున పెరిగిపోతున్నాయి... ఇక, కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న వేళ మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. న్యూస్ దొరికితే చాలు వైరల్ చేసే నెటిజన్లు... మళ్లీ లాక్ డౌన్ అంటూ సాగుతున్న ప్రచారాన్ని షికారు చేయించారు.. అయితే, అవి గాలి కబుర్లేనని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారంటూ కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి.. వీటిపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది... దీంతో మళ్లీ పుర్తిస్థాయిలో లాక్ డౌన్ లేదని స్పష్టం చేస్తోంది కేంద్రం.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







