వెజ్ హసీనా
- February 01, 2016
కావాల్సినవి: బ్రోకోలి - 100 గ్రాములు, జుక్నీ గ్రీన్ అండ్ యెల్లో- 100 గ్రాములు, క్యాబేజ్- 50 గ్రాములు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల క్యాప్సికమ్ - ఒక్కోటి, పచ్చిమిర్చి- రెండు, ఉల్లిపాయలు - ఐదు, టొమాటో- ఒకటి, జీడిపప్పు- నాలుగు, జీలకర్ర- ఒక టీ స్పూన్, గరం మసాలా- అర టీ స్పూన్.
తయారీ విధానం: కూరగాయలన్నీ సన్నగా తరగాలి. ఉల్లిపాయ గ్రేవీ తయారుచేయాలి. అందుకు పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. అందులో తరిగిన నాలుగు ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేగించాలి. అవి వేగుతుండగా జీడిపప్పు, చిటికెడు పసుపు వేయాలి. అవికూడా వేగాక చల్లార్చి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మరో పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, గరంమసాలా, టొమాటో ముక్కలు వేసి వేగిస్తూ కూరగాయ ముక్కల్ని కలపాలి. మంచి వాసన వచ్చేంతవరకు వేగించాలి. తర్వాత ఉల్లిపాయ గ్రేవీ కలిపి సన్నటి మంటమీద కూరగాయలు ఉడికేవరకు ఉంచాలి. వెజ్ హసీనాను రోటీతో తింటే ఆ రుచే వేరు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









