తెలంగాణలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు
- June 11, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 4,320కు చేరింది. మొత్తంగా 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,993 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన కేసుల్లో 175 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్ జిల్లాలో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3, సిద్దిపేట, కొమురం భీం(ఆసిఫాబాద్), వరంగర్ అర్బన్ జిల్లాల్లో 2, ములుగు, కామారెడ్డి, వరంగల్(రూరల్), రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో 1, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







