రజనీకాంత్ పాస్పొర్ట్ మరిచిపోయారు..

- February 01, 2016 , by Maagulf
రజనీకాంత్ పాస్పొర్ట్ మరిచిపోయారు..

సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' షూటింగ్ దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ మలేషియాలో జరగాల్సి ఉంది. ఇందు కోసం రజనీ సోమవారం ఉదయం 11.45 గంటలకు చెన్నై నుంచి మలేషియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం ఆఖరి నిమిషంలో తాను పాస్‌పోర్ట్ మరిచిపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో ఆయనతోపాటు చిత్రయూనిట్‌లోని కొందరు సభ్యులు, నిర్మాత కలైపులి ఎస్.థానులు కొంత సేపు కంగారు పడ్డారు. అయితే రజనీ వెంటనే తన సహాయకులకు ఫోన్ చేసి ఇంటి నుంచి పాస్‌పోర్ట్‌ను తెప్పించుకున్నారు. అదే సమయానికి విమానాన్ని కూడా అందుకోగలిగారు.ఈ విషయం తెలుసుకున్న మీడియా, రజనీ అభిమానులు కొంత సేపు హల్ చేశారు. చివరికి అంతా ప్రశాంతంగా సర్దుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com