13 ఏళ్ళ బాలిక పై అత్యాచారం: అనుమానితుడి అరెస్ట్
- June 15, 2020
దుబాయ్: ఓ కార్మికుడు, 13 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి యత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. బాలిక తండ్రి, తన కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమెను విచారించగా, తాను ఓ వ్యక్తితో ప్రేమలో వున్నట్లు తెలిపిందనీ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారనీ అధికారులు వివరించారు. బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. విచారణ సందర్భంగా 27 ఏళ్ళ పాకిస్తానీ కార్మికుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు ఆ బాలికతో ఇల్లీగల్ ఎఫైర్ వుందనీ, మూడుసార్లు ఆ ఎఫైర్ కొనసాగించానని నిందితుడు విచారణలో అంగీకరించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ బాలిక తనకు పరిచయమయినట్లు నిందితుడు వివరించాడు. కాగా, నిందితుడికి కరినమైన శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. జూన్ 25న ఈ కేసుకి సంబంధించిన తుది తీర్పు వచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







