కరోనా తో హడలిపోతున్న బీజింగ్
- June 16, 2020
బీజింగ్: చైనా రాజధాని పరిస్థితి దారుణంగా ఉందని సాక్షాత్తూ అధికారి ప్రతినిధి బహిరంగ వ్యాఖ్యలు చేశారంటే అక్కడి స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్థానిక జింన్ఫాడీ మార్కెట్ తాజాగా కరోనా కేసులకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. కరోనాను అదుపులోకి తెచ్చామని ఊపిరి పీల్చుకుంటున్న చైనా.. జింన్ఫాడీలో కరోనా కేసులు వేలుగు చూడటంతో ఒక్కసారిగి ఉల్లిక్కిపడింది. కరోనా మరోసారి వీపరీతంగా వ్యాపిస్తుందేమోనని స్థానిక ప్రభుత్వం భయపడిపోయింది. దురదృష్టవశాత్తూ అనుకున్నదంతా జరిగింది. కేవలం ఐదు రోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజుకు సగుటున పదుల సంఖ్యలో కొత్త కేసుల చూడటంతో ప్రస్తుతం బీజింగ్‌లో కరోనా కేసుల సంఖ్య 106కి చేరింది. మంగళవారం నాడు కూడా ఏకంగా 27 కొత్త కేసులు నమోదయ్యాయి.
పరిస్థితి చేయిదాటుతోందని అంతకుమునుపే గ్రహించిన ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రజలకు సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే రాజదానిలో దాదాపు 30 ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి విషమంగా ఉందంటూ అధికార ప్రతినిధి బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచ దేశాలన్నీ మరో కుదుపునకు లోనయ్యాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్ నగర విస్తీర్ణం, జనాభా, దేశంలోని ఇతర ప్రాంతాలతో నగరాన్ని కున్న సంబంధం వంటివాటి దృష్ట్యా ప్రభుత్వం అక్కడి పరిస్థితిని తక్షనం అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







