చికెన్ స్వీట్ కార్న్ సూప్...
- February 01, 2016
సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలిలో బద్దకం. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. చలిగాలికి, వర్షానికి గొంతులోకి కాస్త వేడి వేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా? సూప్ లు ఉన్నాయి కదా.. ఒక పట్టు పట్టవచ్చు కదా....వింటర్ సీజన్ ఎంజాయ్ చేయాలంటే వేడి వేడి సూప్ త్రాగండి..ఉప్పు, కారం, ఒకటి రెండు కూరగాయలు కలిపి మరిగించి స్పూన్ తో నోటికి అందుకుంటే ఆకలి అందుకుంటుంది. బద్దకం పారిపోతుంది. మూడ్ హుషారవుతుంది. ఇంట్లో ఉత్సాహం అడుగు మోపుతుంది. కూరగాయలతోనే కాకుండా మాంసాహారంతో తయారు చేసే సూప్ లు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఆరోగ్యంతో పాటు రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. కమ్మనైన రుచి ఘుభాళించే సువాసనతో చికెన్ స్వీట్ కార్న్ సూప్ మాంసాహార ప్రియులు రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. అనారోగ్య కారణంతో నోటికి రుచి తెలియనప్పుడు ఇటువంటి సూప్ లను తయారు చేసుకొని తాగవచ్చు.....కావల్సినన పదార్థాలు:చికెన్ బ్రెస్ట్ - 100 gramsక్యారెట్స్ - 1/2 cupక్యాబేజ్ - 1/2 cupస్వీట్ కార్న్ కార్నెల్స్ - 2 cupsపెప్పర్ పౌడర్ - 1 teaspoonచిల్లీ పౌడర్ - 1/2 teaspoonకార్న్ ఫ్లోర్ - 1 tablespoonఉప్పు: రుచికి సరిపడానూనె: తగినంత
చికెన్ మష్రుమ్ సూప్తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి.2. ఒక నిముషం తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.3. ఇప్పుడు పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేయాలి. వేడి అయిన తర్వాత అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి.4. తర్వాత 2లీటర్ల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. 5. ఇప్పుడు వాటికి పెప్పర్ పౌడర్ మరియు చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. 6. తర్వాత అందులోనే చికెన్ కూడా వేసి మిక్స్ చేయాలి. 7. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. 8. ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలగలుపుకోవాలి. 9. ఈ మొత్తం మిశ్రమం అంతా 10-15నిముసాలు మెత్తగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ. మరి ఈ హెల్తీ రిసిపిని మీరు కూడా ఎందుకు ట్రై చేయకూడదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







