ట్రాఫిక్ ఉల్లంఘనలపై 'పాయింట్స్' కొరడా
- February 02, 2016
ట్రాఫిక్ జనరల్ డైరెక్టర్ షేక్ నాజర్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ డ్రైవింగ్ లెసెన్సులన్నిటికీ పాయింట్స్ సిస్టమ్‌ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 18 నుంచి ఈ పద్ధతి అమల్లోకి వస్తుంది. వాహనాల్ని నడిపేవారు రోడ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించేలా, ప్రమాదాలను తగ్గించేలా ఈ చర్య తీసుకున్నట్లు షేక్ నాజర్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన విధానాన్ని బట్టి, పాయింట్స్‌ని లెక్కిస్తారనీ, వాటి ప్రకారం చర్యలు తీసుకోబడ్తుందనీ ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఏడాది లోపు డ్రైవింగ్ లెసెన్స్ ఇష్యూ చేయబడి ఉంటే, అన్ని సందర్భాల్లోనూ నిబంధనల ఉల్లంఘనకు డబుల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. 20 పాయింట్లు దాటితే లైసెన్స్ ఆ ఏడాదికి రద్దు చేయబడుతుంది. తొలి ఉల్లంఘన నాటి నుంచి ఏడాదిపాటు ఈ రద్దు అమల్లో ఉంటుంది. ఒకవేళ ఏడాదిలో 20 పాయింట్ల ఉల్లంఘనకు పాల్పడకపోయినా, పాయింట్లు రద్దయిపోతాయి. తొలి నిబంధన నుంచి క్యాలెండర్ ఇయర్ ప్రారంభమవుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి ఆరు నెలల వరకు జైలుతోపాటు 50 నుంచి 500 బహ్రెయినీ దిర్హామ్‌ల ఫైన్ విధించబడుతుంది. లైసెన్స్ లేకపోతే రెండు పాయింట్లు, నిబంధనల్ని ఉల్లంఘించి పార్కింగ్ చేస్తే రెండు పాయింట్లు, ప్రమాదానికి కారణమై, ఆ ప్రమాదంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది గాయపడితే మూడు పాయింట్లు, రాంగ్ ఓవర్‌టేకింగ్‌కి మూడు పాయింట్లు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే ఐదు పాయింట్లు, స్పీడ్ లిమిట్ దాటితే ఏడు పాయింట్లు ఆల్కహాల్, డ్రగ్స్ సేవించి వాహనం నడిపితే 8 పాయింట్లు, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైతే 10 పాయింట్లు కౌంట్ చేయబడతాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







