"జయమ్ము నిశ్చయమ్మురా" "ఫస్ట్ లుక్" త్వరలో
- February 02, 2016
నూతన నిర్మాణ సంస్థ "శివ రాజ్ ఫిల్మ్స్" పతాకంపై రూపొందుతున్న అహ్లాద భరితమైన హాస్య ప్రధాన ప్రేమ కథా చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ శిష్యుడు శివ రాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో "గీతాంజలి" ఫేం శ్రీనివాస్ రెడ్డి హీరో కాగా హీరోయిన్ పూర్ణ. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం "ఫస్ట్ లుక్" త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ రాజ్ కనుమూరి మాట్లాడుతూ. "మన తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్న కాల నేపధ్యంలో పూర్తి వినోద భరితంగా "జయమ్ము నిశ్చయమ్మురా" మలచడమైనది.కరీంనగర్ కుర్రాడికి కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అక్కడ అతనికి జరిగే పరిచయాలు, ఎదురయ్యే పరిణామాల సమాహారంగా రూపొందుతూ సహజ హాస్యానికి పెద్ద పీట వేస్తూ ఓ నగర పాలక సంస్థ కార్యాలయ నేపధ్యంలో జరిగే అందమైన ప్రేమ కథా చిత్రం. త్వరలో జరగబోయే ఆఖరి షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తికావస్తుంది. త్వరలో "ఫస్ట్ లుక్" లాంచ్ చేస్తున్నాం" అన్నారు.శ్రీవిష్ణు, కృష్ణుడు, రవివర్మ, కృష్ణ భగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, జీవా, కృష్ణంరాజు, జోగినాయుడు, డబ్బింగ్ జానకి, మీనా,నారాయణ రావు, సూర్య, గుండు సుదర్శన్, ప్రభాస్ శ్రీను, రోలర్ రఘు, ఫిష్ వెంకట్ ,జబర్దస్త్ సన్నీ, సముద్రం వెంకటేష్, రాహుల్ రామకృష్ణ, సిరి, మాధవి, సరితాశర్మ, జ్యోతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నెల్, ఎడిటింగ్:"ఎడిటర్"వెంకట్, ఎగ్సిక్యుటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్, లైన్ ప్రొడ్యూసర్: జగన్నాధన్ మణి, నిర్మాతలు: శివరాజ్ కనుమూరి-సతీష్ కనుమూరి, రచన-దర్శకత్వం: శివ రాజ్ కనుమూరి!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







