తెలుగు ఐక్యం సేవా కార్యక్రమం
- February 02, 2016
పేద విద్యార్థులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది ఓ అద్భుత కార్యక్రమం. 67వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు ఐక్యం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రో బాల్ వంటి క్రీడలు ఈ సేవా కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. లలితా శివకుమార్ యాదవ్, ప్రైజ్‌లు మరియు రిఫ్రెష్మెంట్స్ని స్పాన్సర్ చేశారు. అలాగే పి. శ్రీధర్ మరియు పి.మధు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు మరియు బుక్స్‌ను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జి.అరుణ్‌కుమార్ మోటివేట్ చేసేలా మంచి స్పీచ్ ఇచ్చారు. ఫౌండేషన్ గురించీ, సామాజిక బాధ్యతలను చేపట్టడం గురించి ఆయన అద్భుతమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ మరియు ప్రిన్సిపల్ మురళీకృష్ణ, లలితా శివకుమార్ యాదవ్ మరియు తెలుగు ఐక్యం, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఎల్లమెల్ల సంతోష్ ఇతర సభ్యులను అభినందిస్తూ, వారి సేవల్ని కొనియాడారు. టీఆర్ఎస్ నేత హనుమంతరావు, డాక్టర్ హరేకృష్ణ చంద్రశేఖరన్ ఫౌండేషన్‌కి అన్నివిధాలా సహకరిస్తామని, అలాగే విద్యార్థులకూ అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







