తెలంగాణ:కొత్తగా 1087 కరోనా కేసులు
- June 27, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోన వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం కొత్తగా 1087మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13436 కి చేరింది. ఇప్పటివరకు 4928 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక శనివారం కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 243కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8265కి చేరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు అత్యధింగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 888 కరోనా కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







