ప్రభుత్వపు ఆంక్షలు..నవీకరించబడిన జరిమానాల జాబితా
- June 28, 2020
యూఏఈ: కరోనా విజృంభిస్తున్న సమయంలో కట్టడి చేసేందుకు గాను కొన్ని ఆంక్షలు విధించటం జరిగింది. వీటిని అతిక్రమించిన వారికి కఠిన జరిమానాలు విధించిన సంగతి విదితమే. మరి ఇప్పుడు యూఏఈ అంతటా లాక్ డౌన్ ఎత్తివేసినా, ప్రతి ఒక్కరు జాగ్రత్తచర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి అని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ కోవలోనే నవీకరించబడిన జరిమానాల జాబితా యూఏఈ అంతటా అమలులో ఉందని ఒక ఉన్నతాధికారి శనివారం హెచ్చరించారు.
"ఉల్లంఘనను పునరావృతం చేసినవారికి జరిమానా రెట్టింపు అవుతుంది. మూడవసారి ఉల్లంఘిస్తూ పట్టుబడినవారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు / లేదా కనీసం 100,000 దిర్హాముల జరిమానా" విధింపబడుతుందని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ యొక్క అత్యవసర, సంక్షోభం మరియు విపత్తుల కమిటీ ప్రాసిక్యూషన్ యాక్టింగ్ చీఫ్ సాలెం అల్ జాబీ అన్నారు.
నవీకరించబడిన జరిమానాల జాబితా..
వ్యక్తులు/కుటుంబాలు/సంఘాలు:
* సమావేశాలు ఏర్పాటు చేసి జనాన్ని పోగేస్తే - 10,000 దిర్హాములు
* ఎవరైనా సమావేశానికి అతిథిగా హాజరైతే - 5,000 దిర్హాములు
* వాహనంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే - 3,000 దిర్హాములు
* నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్యూటర్లకు 30,000 దిర్హాములు, ట్యూటర్‌కు ఆతిథ్యం ఇచ్చేవారికి 20,000 దిర్హాములు
* కార్యాలయాల్లో/ షాపుల్లో/ హోటళ్లలో సామాజిక దూరాన్ని పాటించనట్లైతే ప్రతి వ్యక్తికి 3,000 దిర్హాములు, సంస్థలకు 5,000 దిర్హాములు.
కార్యాలయాల్లో:
* ఆఫీసుల్లో ముసుగులు ధరించకపోతే: కంపెనీకి 5,000 దిర్హాములు, ఉద్యోగికి 500 దిర్హాములు.
కోవిడ్ -19 పరీక్షలు చేయించుకున్నప్పుడు..
* గృహ నిర్బంధ నియమాలను పాటించకపోతే 50,000 దిర్హాములు
* కోవిడ్‌కు పాజిటివ్ పరీక్షించిన వారికి - ట్రాకింగ్ కోసం స్మార్ట్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, స్మార్ట్‌ఫోన్‌లను తీసుకెళ్లడం మరిచిపోయినా 10,000 దిర్హాములు
* అధికారులు వ్యవస్థాపించిన ట్రాకింగ్ పరికరాన్ని/లేదా యాప్ ను దెబ్బతీస్తే 20,000 దిర్హాములు
* కోవిడ్ పరీక్ష చేయడానికి నిరాకరిస్తే 5000 దిర్హాములు
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!