తమిళ సూపర్ స్టార్ జీవితాన్ని ఆధారంగా మణిరత్నం సినిమా !
- February 02, 2016
తమిళ సూపర్ స్టార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మణిరత్నం పై విధంగా స్పందించారు. 24 ఏండ్ల క్రితం రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన 'దళపతి' తమిళనాట సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా పలు భాషల్లో అనువాదితమై ఆయా భాషల్లోనూ అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా రజనీపై బయోపిక్ రూపొందించేందుకు మణిరత్నం అమితాసక్తితో ఉన్నారని ఆయన మాటల్లో స్పష్టంగా తెలియడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అందరిలో క్యూరియాసిటీ పెరిగింది.అయితే ఇందులో స్వయంగా రజనీకాంతే నటిస్తారా లేదా వేరే నటుడు ఎవరైనా నటిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏదిఏమైనా యావత్ భారతదేశం గర్వించదగ్గ నటుడు రజనీకాంత్ జీవిత చరిత్రపై సినిమా రావడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







