భద్రతా కారణాలతో స్కూల్ మూసివేత
- February 02, 2016
అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిఇసి) ఘయాతిలోని వెస్టర్న్ మోడల్ ప్రైవేట్ స్కూల్ మూసివేతకు నిర్ణయం తీసుకుంది. భద్రతా ప్రమాణాల పరంగా అత్యంత అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలోనే ఈ స్కూల్‌ని మూసివేయాలని నిర్ణయించారు. ఎడిసిఇ ఓ ప్రకటనలో, ప్రైవేట్ స్కూల్స్ మరియు క్వాలిటీ ఎష్యూరెన్స్ (పిఎస్క్యుఎ) విభాగంలో స్కూల్‌తో అత్యవసరమైన నిర్వహణకు సంబంధించి చర్చలు జరిపింది. అలాగే స్కూల్ తమ సౌకర్యాలను మెరుగుపరచుకోవాల్సిందిగా ఆదేశించింది. ఎడిఇసి రూపొందించిన 2015 టెక్నికల్ రిపోర్ట్ ద్వారా స్కూల్ స్ట్రక్చర్ వెరీ పూర్ కండిషన్లో ఉందనీ దాంతో, అత్యంత దారుణమైన భద్రతా ప్రమాణాలున్నట్లుగా డిక్లేర్ చేయడమయ్యిందని అధికారులు చెప్పారు. 2015 జులో 20న మూసివేత డిక్రీ జారీ అయ్యింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ మూసివేత నిర్ణయం అమల్లో ఉంటుంది. మూసివేత కారణంగా 502 మంది విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారని గుర్తించి, వారికి వివిధ స్కూళ్ళలో ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించారు. 216 మంది ఎమిరేటీ, అరబ్ స్టూడెంట్సని దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో, 282 మంది ఏసియన్ స్టూడెంట్స్‌కి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రవేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







