ద్రోన్లను ఎగరవేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
- February 02, 2016
ద్రోన్లు ఇప్పుడు విరివిగా ఉపయోగించబడుతున్నాయి. అయితే ద్రోన్లను ఎగరవేయడంలో కొన్ని నిబంధనలను పాటించక తప్పదు. భద్రతా కారణాల రీత్యా, కొన్ని ప్రాంతాల్లో ద్రోన్ల వాడకంపై నిషేధాజ్ఞలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ద్రోన్ల వినియోగంపై జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అబుదాబీలో అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. రెండు వారాలపాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ద్రోన్లను వాడేటప్పుడు ఈ క్రింది విషయాల్ని గుర్తుంచుకోవాలి
1. 400 అడుగులకన్నా ఎత్తులో ద్రోన్లను ఎగురవేయరాదు.
2. పగలు మాత్రమే ద్రోన్లను ఉపయోగించాలి. అది కూడా వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడే ద్రోన్లను ఎగురవేయాలి.
3. ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్స్ తదితర నిషేధిత ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి ద్రోన్లనూ వినియోగించరాదు.
4. ఇళ్ళ మధ్యలో, భవంతుల చుట్టూ, ప్రైవేట్ ప్రాపర్టీస్ వద్ద ద్రోన్లను ఉపయోగించకూడదు.
5. సరదాకి తప్ప, కమమర్షియల్ ఉద్దేశ్యంతో ద్రోన్లను వినియోగించరాదు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







