యూఏఈ:విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా?..అయితే అనుమతి తప్పనిసరి!

- July 02, 2020 , by Maagulf
యూఏఈ:విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా?..అయితే అనుమతి తప్పనిసరి!

యూఏఈ:యూఏఈ నుంచి విదేశీ ప్రయాణాలపై విధివిధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం. అత్యవసరం అనుకుంటే తప్ప ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. అంతేకాదు..విదేశీ ప్రయాణాలకు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా షరతు విధించింది. కరోనా నేపథ్యంలో అనవసర ప్రయాణాలను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కారణాలు ఉన్న వారికి మాత్రమే విదేశీ పర్యటనలకు అనుమతి ఇస్తామని యూఏఈ
అత్యవసర, విపత్తు నిర్వహణ ముఖ్య అధికారి సలీమ్ అల్ జాబీ స్పష్టం చేశారు. వైద్యం, విద్య, వ్యాపార పర్యటనలు, మనవతా కోణంలో మాత్రమే విదేశీ పర్యటనలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర దేశాలకు వెళ్లాలని అనుకుంటే వారు ఏ కారణం చేత వెళ్తున్నారో స్పష్టం చేస్తూ తగిన డాక్యుమెంట్లను దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. ICA వెబ్ సైట్ మేరకు ప్రతి దరఖాస్తుదారులు Dh50 చెల్లించాల్సి ఉంటుంది. పౌర గుర్తింపు అధికార సమాఖ్య ద్వారా దరఖాస్తుదారులు విదేశీ పర్యటనలకు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com