భారతలో 6 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- July 02, 2020
భారత దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ ని నివారించడానికి దేశంలో లాక్డౌన్ విధించి వంద రోజులు పూర్తయ్యింది. ఇప్పుడు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 6,04,641కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 17834కు పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం







