తేజస్వి 'కమిట్‌మెంట్' ఫస్ట్ లుక్ విడుదల
- July 03, 2020
కొద్ది రోజుల క్రితం 'కమిట్‌మెంట్' సినిమాలోని నలుగురు ప్రధాన పాత్రధారులను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. నలుగురి కథగా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంటర్‌టైనర్‌లో తేజస్వి మదివాడ, రమ్య పసుపులేటి, సిమర్ సింగ్, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. "లవ్.. డ్రీమ్.. హోప్.. ఫైట్" అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్.
శుక్రవారం (జూలై 3) తేజస్వి మదివాడ బర్త్‌డే సందర్భంగా, 'కమిట్‌మెంట్'లో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బికినీ ధరించి బోల్డ్ అవతార్‌లో తేజస్వి దర్శనమిస్తున్నారు. మునుపటి పోస్టర్ తరహాలోనే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
'హైదరాబాద్ నవాబ్స్' ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా రచన, దర్శకత్వం అందిస్తోన్న ఈ చిత్రానికి నరేష్ కుమరన్ సంగీతం సమకూరుస్తున్నారు. సజీష్ రాజేంద్రన్, నరేష్ రాణా సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం:
డైలాగ్స్: సంతోష్ హర్ష, కార్తీక్-అర్జున్, కళ్లి కల్యాణ్
లిరిక్స్: పూర్ణాచారి, గాంధీ
మ్యూజిక్: నరేష్ కుమరన్
సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్, నరేష్ రాణా
ఎడిటింగ్: ప‌్రవీణ్ పూడి
కొరియోగ్రఫీ: హరి కిరణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
లైన్ ప్రొడ్యూసర్: సురేష్ పొలాకి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ద‌్వారకేష్
నిర్మాతలు: బలదేవ్ సింగ్, నీలిమ టి.
రచన-దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
బ్యానర్స్: ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్‌లూజ్ ఎంటర్‌టైన్‌మెంట్
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







