`ఫ్రెండ్‌షిప్` సినిమాలోని రజినీకాంత్ ఆంథెమ్ చాలా బాగుంది - రాఘవ లారెన్స్
- July 05, 2020
నా దేహమంతా సూపర్ స్టార్ నా ప్రాణమంతా సూపర్ స్టార్ నా ఊపిరంతా సూపర్‌స్టార్ గొంతెత్తి పాడై సూపర్‌స్టార్ అంటూ హూషారుగా సాగే ఈ పాటతో సూపర్‌స్టార్ రజినీ కాంత్ కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు ‘ఫ్రెండ్‌షిప్’ చిత్ర యూనిట్. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సూపర్ స్టార్ రజినీ ఆంథెమ్ లిరికల్ సాంగ్‌ను రజినీకాంత్‌ను అమితంగా అభిమానించే రాఘవ లారెన్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలైవా ట్రిబ్యూట్ సాంగ్ `సూపర్ స్టార్ ఆంథెమ్`ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా బాగుంది. హర్భజన్ సింగ్ గారికి మరియు ‘ఫ్రెండ్‌షిప్` చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
సంగీత దర్శకుడు డి.ఎమ్ ఉదయకుమార్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కి రాజశ్రీ సుధాకర్ లిరిక్స్ రాయగా మాస్‌ని హత్తుకునేలా హేమచంద్ర చాలా బాగా పాడారు. నాలుగు భాషల్లోనూ ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో యాక్షన్ కింగ్ అర్జున్, సతీష్ నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్‌మురుగన్, రాబిన్,
ప్రొడ్యూసర్స్: జెపిఆర్ & స్టాలిన్,
దర్శకత్వం: జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







