శివరాజ్ కుమార్ నటించిన "బజరంగీ-2" మూవీ టీజర్ కు అద్భుత స్పందన
- July 12, 2020
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త
చిత్రం "బజరంగీ-2" టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్
అయిన " బజరంగీ " చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయిన కానీ పాన్ ఇండియా చిత్రం లాగా బాలీవుడ్ తో సహా అన్ని సౌత్ భాషల వాళ్ళు ఈ చిత్ర టీజర్ ను ఆన్ లైన్ లో షేర్ చేస్తూ టీజర్ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం.ఈ రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.త్వరలోనే తెలుగు లో కూడా ఈ సినిమా డబ్
కానుంది.టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్ లు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా
డబ్బింగ్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేశారు.
టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురుంచి హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ : 2013 లో మేము తీసిన "బజరంగీ" పెద్ద హిట్ కావడం తో దానికి సీక్వెల్ గా ఈ "బజరంగీ-2" మూవీ భారీ గా తీయాలని భావించాం. కానీ ఈ టీజర్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.అన్ని ఇండస్ట్రీ ల నుండి కాల్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్ కి అందరికీ ధన్యవాదాలు." అన్నారు.
"బజరంగీ-2" టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది.బాక్ గ్రౌండ్ స్కోర్,గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో "కెజిఎఫ్" తరహా సినిమా కాబోతుంది అనిపిస్తుంది.పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తుంది. జయన్న ఫిలిమ్స్ బ్యానర్ పై జయన్న మరియు భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ ని ఎ.హర్ష
డైరెక్ట్ చేశారు.థియేటర్ లు ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా
రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







